చరిత్ర సృష్టించిన విండీస్ బౌలర్..

ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ అదిరిపోయే బౌలింగ్‌తో ప్రపంచ రికార్డును సృష్టించాడు. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో తన తొలి ఐదు ఓవర్లలో గ్రీవ్స్ 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేదు. అయితే తన సెకండ్ స్పెల్‌లో మాత్రం అద్భుతం చేశాడు. గ్రీవ్స్.. తన రెండో స్పెల్‌లో ఒక పరుగు కూడా ఇవ్వకుండా వరుసగా ఐదు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో వరుసగా ఐదు ఓవర్లు మెయిడిన్ చేసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2016లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై...