కాలుష్య కాటు.. కాలేయానికి చేటు
కాలేయాన్ని పీల్చి పిప్పి చేసే అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ ‘హెపటైటిస్’. ప్రారంభంలోనే దీనిని గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. శరీరంలోకి ప్రవేశించినా ఎలాంటి లక్షణాలు చూపించకుండా లోలోపలే కాలేయాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి వైద్యులు దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు. ప్రధానంగా హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీ వైరస్ ఎక్కువ మందిపై దాడి చేస్తున్నాయి. మన దేశంలో హెపటైటిస్-బీతో 3.4 శాతం, హెపటైటిస్-సీతో ఒక శాతం మంది బాధపడుతుండగా.. ఒక శాతం మంది గర్భిణులు కూడా ఈ ఇన్ఫెక్షన్ బారినపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు, లివర్ క్యాన్సర్ కారణంగా ప్రతి ఏటా దాదాపు 13 లక్షల మంది మరణిస్తున్నారు. 2030 నాటికి వైరల్ హెపటైటిస్ను ప్రజారోగ్య...