కొడుకు కల కోసం క్యాన్సర్‌ను దాచిన తండ్రి..
చాలా మంది కష్టపడుతూ అవకాశం కోసం కొంత సమయం మాత్రమే ఎదురు చూస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం అవకాశం వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటారు. చివరకు అనుకున్నది సాధించి.. చరిత్రలో నిలుస్తారు. అలాంటి వారి జాబితాలో నిలుస్తాడు టీమిండియా క్రికెటర్ సరాంశ్ జైన్. దేశవాళీ క్రికెట్‌లో ఏళ్ల తరబడి నిలకడగా రాణిస్తున్న సరాంశ్‌కు తన కెరీర్‌లోనే అద్భుతమైన అవకాశం లభించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ మాత్రం రెడ్‌బాల్ క్రికెట్‌లో అదరగొట్టి 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి అరంగేట్రం చేయనున్నాడు. వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు సరాంశ్ జైన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది....