కుంకుమపువ్వు అసలైనదో కాదో ఇలా తెలుసుకోండి.!

కుంకుమపువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసుల్లో ఒకటి. దీనిని వంటల్లో, ఆయుర్వేద ఔషధాల్లో, సౌందర్య సాధనాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నందున చాలామంది దీనిని వినియోగిస్తుంటారు. అయితే అధిక ధర కారణంగా మార్కెట్లో నకిలీ కుంకుమపువ్వు కూడా ఎక్కువగా అమ్ముడవుతోంది. నకిలీ కుంకుమపువ్వు ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంది. అందుకే కుంకుమపువ్వు వాడే ముందు ఇలా పరిశీలించి చూడటం మంచిది. నీటిలో లేదా పాలలో వేసి చూడాలి అసలైన కుంకుమపువ్వును నీటిలో లేదా పాలలో వేసినప్పుడు వెంటనే రంగు వదలదు. కొంత సమయం తర్వాత మెల్లగా లేత పసుపు లేదా బంగారు రంగు వస్తుంది. నకిలీ కుంకుమపువ్వు మాత్రం...