గ్రీన్ కార్డ్ కోసం నిరీక్షిస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్.

అమెరికాలో దశాబ్దాలుగా నివసిస్తున్న మిలియన్ల మంది వలసదారులకు, ముఖ్యంగా గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న భారతీయ హెచ్-1బి (H-1B) నిపుణులకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో కనీసం ఏడేళ్లపాటు నిరంతరాయంగా నివసిస్తున్న దీర్ఘకాలిక నివాసితులు శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించే బిల్లును డెమోక్రటిక్ సెనేటర్ అలెక్స్ పాడిల్లా తిరిగి ప్రవేశపెట్టారు. కాలిఫోర్నియా సెనేటర్ అలెక్స్ పాడిల్లా సోమవారం 'రెన్యూయింగ్ ఇమ్మిగ్రేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1929' (Renewing Immigration Provisions of the Immigration Act of 1929) బిల్లుకు తన మద్దతును పునరుద్ఘాటించారు. ఈ బిల్లును ఆయన...