భార్యకు ఉరేసి.. ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్..

కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో ఘాతుకానికి ఒడిగట్టాడు. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో ఆమెకు ఉరి వేశాడు. భార్య తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి.. ఉరికి వేలాడుతూ ప్రాణం కోసం పోరాడుతున్న ఆమెను లైవ్‌లో వారికి చూపించాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బాగల్‌కోట్ జిల్లా, గలగాలి గ్రామానికి చెందిన ప్రవీణ్ జిగలూర్, భాగ్యశ్రీ జిగలూర్ భార్యాభర్తలు. భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ప్రవీణ్ అనుమానం పెంచుకున్నాడు. గత కొన్ని నెలలనుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా భాగ్యశ్రీ భర్తతో ఉండలేకపోయింది. రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రవీణ్...