మట్టి మనుషులు సృష్టికర్తలు ( కుమ్మర వృత్తి కళాకారులు)
(నాగరికత ఎంతగా విస్తరించిన సాంకేతికత పెరిగినా మన మూ లాలు ఎప్పుడు మట్టిలోనే ఉంటా యి.మట్టిని నమ్ముకుని ఆమట్టి ముద్దకు ప్రాణం పోస్తూ సమాజ ప్రగతికి సంస్కృతికి ఆధారంగా నిలిచిన అపర సృష్టికర్తలు మన "కుమ్మర్లు" నేషనల్ క్లే డే వారోత్సవాల(జూలై 25 _ 31) సందర్భంగా మట్టితో ముడిపడిన మన జీవితాన్ని కుమ్మరి వృత్తి విశిష్టతను కొనియాడుతూ రాసిన కవిత ) మట్టి నుండి పుట్టింది జీవం మట్టితోనే ముడి పడింది జీవితం కుమ్మరి చేతిలో ఆకృతి దాల్చే మట్టి పాత్రలు కుండలు ఆరోగ్యానికి అమృతం లాంటివి ఈ నేల తల్లి ఇచ్చిన వరం కుమ్మర వృత్తి మట్టితో మాణిక్యాలు చేసి ఆధ్యాత్మిక సాంస్కృతిక...