జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాజ్యం..

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (Johnson and Johnson) బేబీ టాల్కమ్‌ పౌడర్‌ ఉత్పత్తిపై 15 ఏండ్లుగా కోర్టులో వ్యాజ్యం నడుస్తుంది. కేసులు వేసిన బాధితులకు పరిహారం చెల్లించేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. దీంతో సుమారు 76,000 మందికి దాదాపు 5.5 బిలియన్‌ డాలర్ల (రూ. 52,663 కోట్లు) పరిహారం ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడించింది. 95 శాతం మంది అంగీకరిస్తే దశాబ్దాల పోరాటానికి తెరపడే అవకాశం ఉంది. ఏమిటీ ఈ వ్యాజ్యం యునైటెడ్‌ స్టేట్స్‌ (US)లో ఈ కంపెనీకి చెందిన బేబీ పౌడర్‌ను వాడటం వల్ల అండాశయ క్యాన్సర్‌ (Ovarian Cancer) వచ్చిందని ఆరోపిస్తూ వేలమంది వినియోగదారులు 15 ఏండ్ల క్రితం...