ఓ మనిషి
ఆత్మవిశ్వాసమే నీవిజయం ఓమనిషి నిన్ను నువ్వు గౌరవించుకో నీలోని శక్తిని నువ్వు గుర్తుంచుకో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసం పోకు నీనీడను చూసి నీవు వెనుకడుగు వేయకు ఓటమి ఎదురైనా గుండె ధైర్యం వీడకు కష్టాల కడలిలో కన్నీరు కార్చకు నీ ఆత్మ గౌరవమే నీఆయుధం నీకృషి సంకల్పం పట్టుదలే నిన్ను విజయ తీరాలకు చేర్చుతుంది సమాజం చూపే అవహేళనలను నీవు లెక్కచేయకు నీఆత్మ విశ్వాసాన్ని ఎన్నడు కోల్పోకు నిన్నటి చెడు జ్ఞాపకాలను వదిలేయ్ నేటి కొత్త రోజు నీకోసమే అనుకో ఎవరు నిన్ను తక్కువ చేసిన కుంగిపోకు నీగొప్పతనాన్ని మాటల్లో కాక చేతల్లో చూపించు తప్పులు జరుగుతే నేర్చుకో గుణపాఠం...