బతుకును బలిచేయకు
జీవితం విలువైనది క్షణికావేశానికి గురికావధ్దు బంగారం లాంటి బతుకును బలి చేయకు గెలుపు ఓటములు పొగడ్తలు తెగడ్తలు ఆకాశంలో తెప్పల్లాంటివి చీకటి వెలుగులు ప్రకృతి సహజం సమస్యలకు భయపడకు ధైర్యంతో ఎదురుకో సహనాన్ని పెంచుకో శోధించి సాధించాలి సంకల్పమే నీ ఆయుధం మనసు మాయలో భంథీవి కాకు ఒంటరి తనం వద్దు కలిమిడియే ముద్దు గతాన్ని తలవకు వర్ధమానాన్ని మరువకు పోలికత్వంలో కూరుకు పోకు బతుకు కన్నీటి దారలలోనే భలిచేయకు ఆశయే నీ ఆభరణమైతే ఆందోళన మాయమౌనులే మనసు మబ్బుల్లో ఒత్తిడి జల్లుల్లో తడిసి ముద్దవుతే పలకరింపు నీ ఆయుథమైతె ఆత్మవిశ్వాసమే నీ భరోసా భద్రత అవుతది నిర్మలత్వం నీ ధరి చేరేను ఆందోళన అంతరించేను...