దేవరకొండ – ఎస్‌పీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘనంగా మాక్ ఎలక్షన్ (నమూనా ఎన్నికలు) నిర్వహణ

దేవరకొండ 28జూలై (BVK 3 న్యూస్ ) : భావి భారత పౌరులలో ప్రజాస్వామ్య స్పృహను పెంపొందించే లక్ష్యంతో దేవరకొండలోని ఎస్‌పీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మంగళవారం 'మాక్ ఎలక్షన్' (నమూనా ఎన్నికల) కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ​పాఠశాల ప్రిన్సిపాల్ చెన్నూరి లింగం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ... విద్యార్థి దశ నుంచే ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు ప్రాముఖ్యత మరియు సరైన నాయకుడిని ఎన్నుకునే విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. నిజాయితీ, సేవాభావం, క్రమశిక్షణ కలిగిన నాయకత్వ లక్షణాలు యువత అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్వయంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ​ఈ కార్యక్రమంలో విద్యార్థులు...