ప్రభుత్వాలను ఏఐ అంతం చేస్తుంది..

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా మరోసారి తనదైన శైలిలో విరుచుకుప‌డ్డారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా రాజకీయ నాయకులు, ప్ర‌భుత్వ అధికారుల‌కు ఎంత ముప్పు రాబోతుందో ఎక్స్ వేదిక‌గా రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఉన్న‌ పాలనా వ్యవస్థలో రాజకీయ నాయకులు అధికారులను పర్యవేక్షిస్తుంటే, ఆ అధికారులు ప్రభుత్వ పనులను నిర్వహిస్తున్నారాని. ఈ మొత్తం వ్యవస్థ కేవలం ‘నిజాయితీ’, ‘నిర్భయం’ అనే రెండు మానవ బలహీనతల మీద ఆధారపడి నడుస్తోంద‌ని ఆర్జీవీ చెప్పుకోచ్చాడు. అయితే ఒక అధికారి కూడా సాధారణ మనిషే కదా! అతనిపై బదిలీ అవుతుందనే భయం, పిల్లల స్కూల్ అడ్మిషన్ల టెన్షన్, పెద్ద ఇల్లు కొనుగోలనే కోరిక,...