మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మిసిర్ బేస్రా అరెస్ట్‌..

దేశంలో మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు (Most Wanted Maoist) నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సీపీఐ (మావోయిస్టు) పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్‌ బేస్రా (Misir Besra) ఎట్టకేలకు భద్రతా బలగాలకు చిక్కాడు. ఆయన తలపై రూ.1 కోటి రివార్డు ఉండ‌టం గమనార్హం. జార్ఖండ్‌ (Jarkhand) లో జరిగిన సంయుక్త ఆపరేషన్‌ (Joint Operation) లో ఆయనతోపాటు మరో ఇద్దరు కీలక మావోయిస్టు నాయకులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మావోయిస్టు వ్యతిరేక పోరులో ఇది అత్యంత కీలక విజయాల్లో ఒకటిగా భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అధికారులు వెల్ల‌డించిన‌ వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి జార్ఖండ్‌ పోలీసులు, కేంద్ర రిజర్వ్‌ పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌), కోబ్రా బెటాలియన్‌...