వెంకటేష్ – త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. జెన్‌జీ కూతురు పాత్రను పరిచయం చేసిన మేకర్స్!
విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) నుంచి చిత్రబృందం మరో ఆసక్తికర గ్లింప్స్‌ను విడుదల చేసింది. రోజుకో కొత్త వీడియోతో సినిమా ప్రచారాన్ని వేగవంతం చేస్తున్న మేకర్స్, తాజాగా ఈ చిత్రంలో వెంకటేష్ కూతురిగా, చిట్టిబాబు గారాలపట్టిగా నటిస్తున్న సంపూర్ణ (యువినా పార్థవి) పాత్రను పరిచయం చేశారు. పరిచయమైన ప్రతి ఒక్కరితో ప్రేమలో పడే జెన్‌జీ కూతురి పాత్రలో సంపూర్ణ కనిపించబోతుంది. ఇక త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, వినోదాత్మక ఘట్టాలతో నిండిన ఈ వీడియో సోషల్ మీడియాలో సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.