ఫేక్‌సైట్లతో టీటీడీ భక్తులను దోచుకుంటున్న సైబర్ మోసగాళ్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేరుతో సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండేలా ఫేక్ వెబ్‌సైట్ రూపొందించి, భక్తులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. "ttddevasthanam.online" పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి, అర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నారని తెలిపారు.ఈ ఫేక్ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నించే భక్తుల నుంచి వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, ఆన్‌లైన్ చెల్లింపులు సేకరించి సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండేలా డిజైన్ చేయడంతో...