ఘనంగా యువతి సమ్మేళనం
దేవరకొండ 29జూలై (BVK 3 న్యూస్ ) :నేరడుగొమ్ము మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాలలో గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్,సెంటర్ ఫర్ వరల్డ్ సోలిడారిటీ (సిడబ్ల్యూఎస్)ఆధ్వర్యం లో యువతి సమ్మేళనం ప్రోగ్రాం స్కూల్ సిబ్బంది సహకారంతో నిర్వహించారు.పాఠశాల ఆవరణలో తొమ్మిది స్టాలను ఏర్పాటు చేశారు.విద్యార్థులందరూ ఆ స్టాలను సందర్శించి అవగాహన పెంచుకున్నారు.పర్యావరణం -పరిరక్షణ,రాజ్యాంగ హక్కులు,సైబర్ భద్రత, బాల్యవివాహాలు,లైంగిక వేధింపులు,ఆరోగ్య-పౌష్టికాహారం,నాయకత్వం, నెలసరి అవగాహన, రంగుల సందడి మొదలగు స్టాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు చూపించారు. విద్యార్థినిలు ఆటపాటలతో అలరించారు.అనంతరం సభ ఏర్పాటు చేసి వాటి యొక్క లాభనష్టాలు గూర్చి వివరించారు.ఈ క్రింది విషయాలను గూర్చి మాట్లాడారు. అందరూ పర్యావరణాన్ని పరీక్షించాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన...