మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఆచార్య సినారె జయంతి వేడుకలు

దేవరకొండ 29జూలై (BVK 3 న్యూస్ ) : మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), దేవరకొండలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాట్లాడుతూ సాహిత్యాన్ని విద్యార్థులందరూ చదవాలని సాహిత్యం ద్వారా మనం ఎన్నో ఉన్నతమైన విలువలను నేర్చుకుంటామని పేర్కొన్నారు.అలాగే సినారె గారి సాహిత్యంలోని అంశాల్ని సమాజానికి అన్వయిస్తూ అనేక విషయాల పైన మాట్లాడుతూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ & తెలుగు విభాగాధిపతి జి.కోటయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, డా. వి. మకట్లాల్, తెలుగు...