అడ్డతీగల ఉపాధి పనుల పై సమీక్ష....

పోలవరం బీవీకే న్యూస్ 3 ప్రతినిధి :29 అడ్డతీగల మండలం ఎంపీడీవో కుమార్ ఆధ్వర్యంలో బుధవారం వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫామ్ పండ్లు, ట్రెంచులు, మ్యాజిక్ డ్రయిన్స్, పండ్ల తోటలు గుంతలు తవ్వకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఏపీవో చిరంజీవి రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.