తులసి ఆకుల్లో ఎలాంటి సమ్మేళనాలు ఉంటాయి..
తులసి భారతీయ సంస్కృతిలో పవిత్రమైన మొక్కగా మాత్రమే కాకుండా, ఆయుర్వేదంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఔషధ మూలికగా కూడా గుర్తింపు పొందింది. భారత ఉపఖండంలో సులభంగా పెరిగే ఈ మొక్క ప్రధానంగా ఆకుపచ్చ రంగులో ఉండే లక్ష్మీ తులసి, ఊదా రంగులో కనిపించే కృష్ణ తులసి అనే రెండు రకాలుగా లభిస్తుంది. భారత్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా తులసి విస్తృతంగా పెరుగుతుంది. హిందూ సంప్రదాయంలో తులసిని పూజించడం, ఇళ్లలో పెంచడం వెనుక ఆధ్యాత్మిక కారణాలతోపాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని భావిస్తుంటారు. తులసి ఆకులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం, బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్ల...