షూటింగ్‌లో రష్మిక మందన్నాకు గాయం..
టాలీవుడ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోలు అనుకోకుండా ఆస్పత్రి పాలవ్వగా.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) సైతం గాయపడింది. ‘మైసా’, ‘రణబాలి’ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక షూటింగ్‌లో యాక్షన్, నృత్య సన్నివేశాలు తెరకెస్తుండగా తీవ్రంగా గాయపడింది. సత్వరం చికిత్స అందించి.. ఆమెకు పూర్తిగా ఆరు వారాలు విశ్రాంతి సూచించారు డాక్టర్లు. దాంతో, తెలుగింటి కోడలు కొన్ని వారాలు షూటింగ్‌కు దూరం కానుంది. ‘గీతగోవిందం’, ‘పుష్ప’, ‘గర్ల్‌ఫ్రెండ్’ ఫేమ్ రష్మిక మందన్నా షూటింగ్ సమయంలో గాయపడింది. మైసా, రణబాలి చిత్రాల కోసం కష్టమైన యాక్షన్, నృత్య సన్నివేశాలు తీస్తుండగా రష్మిక గాయపడింది. దాంతో, వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. రష్మికను పరీక్షించిన వైద్యులు...