డెబ్యూ మూవీకి బాక్సాఫీస్ షాక్..

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram) భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందు డీసెంట్ బజ్ క్రియేట్ అయినప్పటికీ, థియేటర్లలోకి వచ్చాక మాత్రం ఊహించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. తొలి రోజే ఈ చిత్రానికి ఆడియన్స్ మరియు క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన లభించడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.ఈ చిత్రంతో డెబ్యూ హీరోగా పరిచయమైన జయకృష్ణ ఘట్టమనేని తన తొలి సినిమాతోనే నటనపరంగా, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేశారు. ముఖ్యంగా ఆయన...