రజనీకాంత్ నుంచి రాశీ ఖన్నాకు స్పెషల్ గిఫ్ట్..
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించే అవకాశం రావడం ఏ నటుడికైనా, నటికైనా ప్రత్యేకమైన అనుభవమే. అలాంటి అవకాశం దక్కిన హీరోయిన్ రాశీ ఖన్నాకు షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే తలైవా నుంచి ఊహించని బహుమతి అందింది. రజనీకాంత్ స్వయంగా ఓ ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆమెకు కానుకగా ఇవ్వడంతో రాశీ ఖన్నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ చిత్రంలో రాశీ ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా ఇద్దరి...