ఆధ్యాత్మిక గురువుతో ప్రేమలో పడ్డ హీరోయిన్ మృణాళిని రవి..
దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మృణాళిని రవి త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది. మలేసియాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మహావిష్ణుతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించిన మృణాళిని, కాబోయే భర్తతో కలిసి దిగిన అందమైన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొత్త జీవితానికి శ్రీకారం చుట్టబోతున్న ఈ జంటకు నెటిజన్లు కూడా అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. సమాచారం ప్రకారం, మృణాళిని రవి మరియు మహావిష్ణు గత...