ఇది ‘రామ్ యుగ్’ ఆరంభం..

నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మైథలాజికల్ ‘రామాయణ’ ట్రైలర్‌పై ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రశంసల జల్లు కురిపించారు. ఇది ‘రామ్ యుగ్’ (Ram Yug) ఆరంభమని, అధర్మంపై ధర్మం ఎప్పటికీ గెలుస్తుందనే శక్తివంతమైన సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుందని ఆయన కొనియాడారు. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. ఈ ట్రైలర్‌లోని అద్భుతమైన విజువల్స్, నటీనటుల బలమైన అభినయం, ముఖ్యంగా హన్స్ జిమ్మర్ – ఏఆర్ రెహమాన్ ల అద్భుతమైన మ్యూజికల్ కొలాబరేషన్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా ఇండస్ట్రీ...