‘మిర్జాపూర్’ మూవీ నుంచి క్రేజీ ర్యాప్ సాంగ్..
ఓటీటీలో భారీ క్రేజ్ సంపాదించుకున్న పాపులర్ ఫ్రాంచైజ్ ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ‘మిర్జాపూర్ ది మూవీ’ (Mirzapur The Movie) నుంచి మేకర్స్ ఒక క్రేజీ మాస్ ర్యాప్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘దో నంబరీ’ (Do Numbari) పేరుతో వచ్చిన ఈ హై-వోల్టేజ్ సాంగ్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.ఈ పాటను ప్రముఖ ర్యాపర్ దండా నియోలీవాలా (Parveen) ఆలపించడమే కాకుండా స్వయంగా సాహిత్యాన్ని అందించి, స్వరపరిచారు. ‘బందే నంబర్ 1 కే.. ధంధే దో నంబరీ’ అంటూ సాగే లిరిక్స్, ఊరమాస్ బీట్స్ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4, 2026 న థియేటర్లలో...