తరుణ్ తేజ్‌పాల్‌కు పదేండ్ల జైలు శిక్ష
తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5 లక్షల జరిమానాను విధిస్తూ బాంబే (Bombay) హైకోర్టు తీర్పు వెలువరించింది. తేజ్‌పాల్ తనపై రేప్ చేశాడని తెహెల్కా (Tehelka) ఉద్యోగిని 2013లో కేసు పెట్టింది. దీనిపై విచారణ చేపట్టగా బాంబే హైకోర్టులోని గోవా ట్రయల్ కోర్టు 2021లో నిర్దోషిగా తీర్పు వెలువరించింది. దీనిపై గోవా ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. విచారణ అనంతరం నేడు 10 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా విధించింది బాంబే హైకోర్టు. అంతేకాకుండా రెండు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆర్డర్ వేసింది.జస్టిస్ (Justice) నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్‌సాందేకర్‌లతో కూడిన...