వాళ్లు దోషులైనా లేదా అసమర్థులైనా అయ్యుండాలి: రాహుల్ గాంధీ
పార్లమెంటుకు విద్యార్థుల ర్యాలీ సందర్భంగా పోలీసు బలప్రయోగానికి దిగడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ ఉదంతంలో పాలకులు దోషులైనా లేదా అసమర్థులైనా అయ్యుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.‘పెల్లెట్ గన్నులు, ముళ్లు ఉన్న బాటన్స్, టియర్ గ్యాస్.. వీటితో విద్యార్థులపై దాడులు జరిగాయి. శాంతియుతంగా ప్రశ్నలు అడిగిన వారిపై దాడులు జరిగాయి. యువతులను కూడా పోలీసులు కొట్టారు. పలువురికి ఎముకలు విరిగాయి. ప్రశ్నలు అడిగిన వారితో మోదీ ప్రభుత్వం అనాగరికంగా వ్యవహరించింది’‘పార్లమెంటు సమావేశాలు 20 రోజులుగా జరుగుతున్నా హోం మంత్రి సభకు రాలేదు. విద్యార్థులపై బలప్రయోగంపై చర్చించేందుకు ప్రతిపక్షం ప్రవేశపెట్టిన ప్రతి తీర్మానం...