తమిళ్ తాయ్ వాజ్తు‌తోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..

తమిళనాడులో భాషా, సాంస్కృతిక గుర్తింపునకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వాజ్తు'ను తప్పనిసరిగా ఆలపించేలా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించిందితీర్మానం ప్రకారం తమిళనాడులోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వాజ్తు'ను ఆలపించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా మద్దతు లభించింది. డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, పీఎంకే, వీసీకే, సీపీఐ, బీజేపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తదితర పార్టీల సభ్యులు తీర్మానానికి మద్దతు తెలిపారు....