వైన్ తాగే వారిలో ర‌క్త‌నాళాల్లో త‌గ్గిన కొవ్వు నిల్వ‌లు..

మధుమేహంతో బాధపడుతున్నవారిలో గుండె సంబంధిత సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో కొవ్వు, ఇతర పదార్థాలు పేరుకుపోయి ప్లాక్‌ ఏర్పడటం వల్ల రక్తప్రసరణకు ఆటంకం కలుగుంది. అయితే వైన్‌ను పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల కొంతమంది మధుమేహుల్లో రక్తనాళాల్లో పేరుకుపోయిన ప్లాక్‌ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనం సూచించింది. యురోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో, రక్తనాళాల్లో ఇప్పటికే ప్లాక్‌ ఉన్న మధుమేహ బాధితులను పరిశీలించారు. అధ్యయనం ప్రారంభంలో రక్తనాళాల్లో ఎక్కువగా ప్లాక్‌ ఉన్నవారిలో, రెండు సంవత్సరాల తర్వాత ఈ పేరుకుపోయిన పదార్థాల్లో స్వల్పమైనప్పటికీ గణనీయమైన తగ్గుదల కనిపించింది. 2 ఏళ్ల త‌రువాత తేడాలు.. అయితే రెండు...