వర్షాకాలంలో ఇంట్లో క్రిములు పెరగకుండా ఉండాలంటే..

వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడంతో ఇళ్లలో బూజు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్, సింక్‌ వంటి తడి ప్రదేశాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంటిని శుభ్రంగా, పొడిగా, గాలి బాగా ప్రసరించేలా ఉంచడం చాలా ముఖ్యం. తరచుగా తాకే ప్రదేశాలను శుభ్రం చేయండి తలుపుల హ్యాండిల్స్‌, లైట్‌ స్విచ్‌లు, టేబుళ్లు వంటి వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. వీటిపై దుమ్ము, మురికి పేరుకుపోకుండా సబ్బు నీరు లేదా ఇంట్లో ఉపయోగించే సర్ఫేస్‌ క్లీనర్‌తో తుడవచ్చు. వంటగదిపై ప్రత్యేక శ్రద్ధ వంటగదిలోని సింక్‌, కౌంటర్లు, స్టవ్‌ వంటి ప్రదేశాలను రోజూ శుభ్రం చేయడం మంచిది. వాడిన...