ఇరాన్‌తో చేతులు కలిపితే ఒమన్‌పై బాంబు దాడి చేస్తాం..
మిత్రదేశమైన ఒమన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక హెచ్చరిక జారీ చేశారు. హార్ముజ్ జలసంధి తెరిచే విషయంలో ఇరాన్‌తో ఒమన్ చేతులు కలిపితే ఒమన్‌పై కూడా బాంబు దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌తో ఒమన్ దూరంగా ఉండాలని సూచించారు. గల్ఫ్ సంక్షోభం కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఆ దేశం మూసేసింది. దీంతో ఒమన్ సహా పలు గల్ఫ్ దేశాలకు చెందిన చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో ఒమన్ సహా అనేక గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.ఇక, అమెరికా కూడా హార్ముజ్ జలసంధిని దిగ్భందించింది. ఈ నేపథ్యంలో ఒమన్‌కు తీవ్ర నష్టం వస్తుండటంతో తన...