భారతీయులు, అమెరికన్లకే హోటల్ గదులా..

ఇటీవల యూఏఈలో పాకిస్థాన్ ప్రయాణికులను అవమానించారని, వారికి హోటల్ వసతి కల్పించలేదని ఆ దేశ మాజీ జాతీయ అసెంబ్లీ స్పీకర్, ఎంపీ అసద్ ఖైసర్ ఆరోపించారు. విమానం రద్దయిన తర్వాత భారత, అమెరికా పాస్‌పోర్టులు కలిగిన ప్రయాణికులకు మాత్రం హోటల్ వసతి కల్పిస్తామని ప్రకటించారని అసద్ పాకిస్థాన్ పార్లమెంట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై యూఏఈ అధికారులతో దౌత్య మార్గాల్లో మాట్లాడాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు యూఏఈలో తాను ప్రయాణిస్తున్న విమానం రద్దయిందని, దీంతో తనతో పాటు ప్రయాణిస్తున్న ఇతర పాక్ ప్రయాణికులు హోటల్‌లో బస చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. అయితే అక్కడ పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌దారుల పట్ల సరైన విధంగా వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు. హోటల్‌లో భారత,...