ఆడ దోమలు మాత్రమే రక్తం ఎందుకు పీలుస్తాయి?
వర్షాకాలంలో దోమల బెడద పెరుగుతుంది. దోమ కుట్టిన చోట దురద, మంట, వాపు వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే దోమలు అసలు మనుషులు, జంతువుల రక్తాన్ని ఎందుకు పీలుస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అన్ని దోమలు రక్తం పీల్చవు. అంతేకాదు, రక్తం వాటికి ప్రధాన ఆహారం కూడా కాదు. ఆడ దోమలే రక్తం ఎందుకు పీలుస్తాయి? సాధారణంగా ఆడ దోమలు మాత్రమే మనుషులు, జంతువుల రక్తాన్ని పీలుస్తాయి. మగ దోమలు రక్తాన్ని పీల్చవు. మగ, ఆడ దోమలు రెండూ పూల మకరందం, మొక్కల రసంలోని చక్కెరలను తీసుకుని శక్తిని పొందుతాయి. అయితే ఆడ దోమలు ప్రధానంగా గుడ్లు పెట్టేందుకు, వాటిని అభివృద్ధి చేయడానికి...