రాజకీయ కక్ష సాధింపులు ఇక చెల్లవు

ఇది పాత కాలపు ప్రాచీన యుగం కాదని, జెన్ జీల ఆధునిక యుగమని ఈ యుగంలో రాజకీయ కక్ష సాధింపులకు తావు లేదని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్‌తో కలిసి ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ లో విస్తృతంగా పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా గూడూరు పాడులో పర్యటించిన కందాల ఇటీవల రాజకీయ కక్షల నేపథ్యంలో కొందరు వ్యక్తుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త మారుతి రామారావు, మరో బాధితుడు బట్టు రామారావును పరామర్శించారు. ఈ సందర్భంగా కందాల మాట్లాడుతూ అకారణంగా పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తే సహించేది లేదన్నారు....