‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ ట్యాగ్‌పై ప్రభాస్ రియాక్షన్ ఇదే.. ‘

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను, భారీ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే ఇంతటి స్టార్‌డమ్ వచ్చినా ఆయనలో గర్వం కనిపించదని, చాలా సింపుల్‌గా ఉండటం ప్రభాస్ ప్రత్యేకత అని ఆయనతో పనిచేస్తున్నవారు తరచూ చెబుతుంటారు. ఇదే విషయాన్ని మరోసారి ‘స్పిరిట్’ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. ‘స్పిరిట్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ సమయంలో ప్రభాస్ పేరుకు ముందు...