ఒక‌సారి త‌గ్గిన త‌రువాత చికున్‌గున్యా మ‌ళ్లీ వ‌స్తుందా..

కీళ్ల నొప్పులు, వాపు, బిగుతు వంటి లక్షణాలు చికున్‌గున్యా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొన్ని వారాలు, నెలలు కొనసాగడం కొంతమందిలో కనిపిస్తుంది. జ్వరం, దద్దుర్లు తగ్గిపోయిన తర్వాత కూడా నొప్పి తిరిగి రావడంతో చాలామందికి మళ్లీ చికున్‌గున్యా సోకిందా అనే అనుమానం కలుగుతుంది. అయితే, సాధారణంగా ఇది కొత్తగా వైరస్‌ సోకడం కాకుండా, గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్‌ తర్వాత కీళ్లలో కొనసాగుతున్న వాపు, రోగనిరోధక వ్యవస్థలో మార్పుల కారణంగా ఏర్పడే సమస్యగా నిపుణులు చెబుతున్నారు. చికున్‌గున్యా రెండోసారి సోకడం చాలా అరుదుగా జరుగుతుంది. ఒకసారి ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్న తర్వాత శరీరంలో వైరస్‌ను నిరోధించే యాంటీబాడీలు దీర్ఘకాలం పాటు రక్షణ కల్పిస్తాయి. అందువల్ల నెలలు...