కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా?

కాఫీ చాలా మందికి రోజూ తీసుకునే పానీయంగా మారిపోయింది. అయితే కాఫీ తాగే అలవాటుకు శరీరంలోని కొవ్వు, కండరాల పరిమాణానికి మధ్య సంబంధం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఎక్కువగా కాఫీ తాగే వ్యక్తుల్లో మొత్తం శరీర కొవ్వుతో పాటు పొట్టలోని అంతర్గత కొవ్వు తక్కువగా ఉండగా, కండరాల పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎక్కువ, తక్కువ కాఫీ తాగే వర్గాల మధ్య BMIలో పెద్దగా తేడా కనిపించలేదు. BMI అంటే ఎత్తు, బరువు ఆధారంగా శరీర బరువు స్థితిని అంచనా వేసే కొలమానం. అయితే శరీరంలో కొవ్వు ఎంత ఉంది, కండరాలు ఎంత ఉన్నాయి అనే విషయాన్ని BMI...