పనీర్ తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
పనీర్.. భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన పాల ఉత్పత్తి. కూరలు, టిక్కాలు, స్నాక్స్ ఇలా అనేక రకాలుగా దీనిని తీసుకుంటారు. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, కాల్షియం వంటి పోషకాలు అందించడంలో పాల ఉత్పత్తులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యంతో పాటు కండరాలు, నరాల పనితీరుకు కూడా అవసరం. అయితే పనీర్‌ను ఎంత తీసుకుంటున్నాం, ఏ రకమైన పనీర్ ఎంచుకుంటున్నాం, దాన్ని ఎలా వండుతున్నాం అనే అంశాలు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.పనీర్‌లో ఉండే అధిక నాణ్యత కలిగిన ప్రొటీన్లు శరీర కణజాలాల నిర్మాణం, మరమ్మతులకు ఉపయోగపడతాయి. ప్రొటీన్లు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంలోనూ సహాయపడతాయి. అలాగే పాల ఉత్పత్తులు...