‘కాక’తో కేక పుట్టిస్తున్న మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సినిమాను ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌లో కొనసాగుతోంది. చిరంజీవిని సరికొత్త లుక్‌లో చూపించడంతో పాటు కథలో యాక్షన్, భావోద్వేగ అంశాలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మెగాస్టార్‌ను తెరపై మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో చూడబోతున్నామనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.తాజాగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. ఇందులో...