‘దృశ్యం 3’కు టైటిల్ ఫిక్స్..

బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అజయ్ దేవగణ్, టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘దృశ్యం 3’ పై తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. మేకర్స్ సినిమా అధికారిక టైటిల్‌ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటివరకు ‘దృశ్యం 3’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘దృశ్యం 3: ది కంక్లూజ‌న్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌లోనే ‘ది కన్‌క్లూజన్’ అని పేర్కొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంటే అజయ్ దేవగణ్ నటిస్తున్న హిందీ ‘దృశ్యం’ కథకు ఈ సినిమాతో ముగింపు పలకనున్నారా? అనే చర్చ మొదలైంది....