బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం హత్య..
బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో హిందూ కుటుంబం దారుణ హత్యకు గురైన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబంలోని నలుగురిని హత్య చేసిన తర్వాత కూడా నిందితులు వెంటనే అక్కడి నుంచి పారిపోలేదు. కొన్ని గంటల పాటు అదే ఇంట్లో ఉండి స్నానం చేసి, ఫ్రిజ్‌లో ఉన్న దోసకాయలు, ఖర్జూరాలు తిన్నారు. అనంతరం అక్కడే మాదకద్రవ్యాలను సేవించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మృతులను రంగ్‌పూర్ జిల్లా పాఠశాల మాజీ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె ఆగామి (23), కుమారుడు ప్రియమ్ (12)గా గుర్తించారు. రంగ్‌పూర్ నగరంలోని దాస్‌పారా ప్రాంతంలోని వారి ఇంట్లో శనివారం రాత్రి సుమారు...