ఆర్టరీస్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి?..

ఆధునిక జీవనశైలిలో గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆహారపు అలవాట్లపై శ్రద్ధ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ధమనుల్లో(ఆర్టరీస్) కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ప్రమాదం పెరగవచ్చు. అయితే సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఒమేగా–3 ఉన్న ఆహారం సాల్మన్ వంటి కొవ్వు చేపలు, సార్డిన్లు, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా గింజలు వంటి వాటిలో ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యానికి తోడ్పడడంలో ఉపయోగపడతాయి. చేపలు తినని వారు గింజలు, విత్తనాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. పీచు పదార్థాలు...