ఇరాన్‌పై అత్యంత తీవ్ర‌మైన ఆర్థిక‌ ఆంక్షలు విధించిన అమెరికా..

ఇరాన్‌పై మొన్న‌టి వ‌ర‌కు భౌతిక దాడుల‌కు పాల్ప‌డిన అమెరికా ఇప్పుడు రూటు మార్చింది. స‌రికొత్త ఆంక్ష‌ల పేరుతో టెహ్రాన్ ఆర్థిక మూలాలను దెబ్బ‌తీయాల‌ని యోచిస్తున్న‌ది. ఇందులో భాగంగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ఇరాన్‌పై చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ప్రకటించారు. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌క్యాస్ట్’ పేరుతో ఈ కొత్త ఆంక్షల ప్యాకేజీని ప్రకటించారు. ఇరాన్ ఆర్థిక మూలాలను పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. టెహ్రాన్‌పై ఇది ఒక ‘ఆర్థిక డి-డే’ లాంటిదని హెచ్చరించారు. డిజిటల్ ఆస్తులు, టెక్నాలజీ, బంగారం, విమానయానం, నౌకా రవాణా వంటి కీలక రంగాలను ఈ ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చారు. ఇరాన్‌తో వ్యాపారం కొనసాగించే...