త్రివర్ణ రంగుల గౌను ధ‌రించిన ఊర్వశి రౌతేలా ..

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో మిస్ యూనివర్స్ ఇండియా 2026 అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. దేశవ్యాప్తంగా వచ్చిన పలువురు అందగత్తెల మధ్య జరిగిన ఈ పోటీలో కేరళకు చెందిన కేజియా లిజ్ మెజో విజేతగా నిలిచి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆమె ప్రతిష్టాత్మకమైన 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ పోటీలకు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్, నటి ఊర్వశి రౌతేలా, సెలీనా జైట్లీ జడ్జింగ్ ప్యానెల్‌లో ఉండగా, ఈ కార్యక్రమంలో ఊర్వశి ధరించిన ప్రత్యేక గౌను ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్...