ఇరాన్ నా కుమారుల్లో ఒకరిని చంపేందుకు ప్రయత్నించింది..!
ఇరాన్ తన కుమారులలో ఒకరిని చంపడానికి ప్రయత్నించిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రమైన ఆరోపణలు చేశారు. నెతన్యాహు ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఛానెల్ 14’తో మాట్లాడిన ఫోన్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇద్దరు కుమారులలో ఒకరిని హతమార్చేందుకు ఇరాన్ తీవ్రంగా ప్రయత్నించిందని ఆయన తెలిపారు. “ఒక నమ్మశక్యం కాని ఘటన జరిగింది. ఇరాన్ నా కుమారులలో ఒకరిని లక్ష్యంగా చేసుకుంది. నా కుమారుడి ప్రాణాలు తీసేందుకు ఇరాన్ ప్రయత్నించింది” అని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే, ఈ కుట్ర ఎప్పుడు జరిగింది, ఎక్కడ, ఎలా జరిగింది అనేది స్పష్టం చేయలేదు. అలాగే తన ఇద్దరు కుమారులైన యాఇర్, అవ్‌నెర్‌లలో ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారనే...