ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..

వచ్చే నెల న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే, దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌లో జిన్‌పింగ్ పర్యటించినట్లు అవుతుంది. 2020లో గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.జిన్‌పింగ్ వెంట సుమారు 400 మంది అధికారులు, ప్రతినిధులతో కూడిన భారీ బృందం భారత్‌కు వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. 2019లో జిన్‌పింగ్ భారత్‌కు వచ్చినప్పుడు ఆయన వెంట వచ్చిన బృందంలో 200 మందికి లోపే ఉన్నారు. ఈసారి దాదాపు రెట్టింపు...