‘టాక్సిక్’ డివైడ్ టాక్..

కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదిరిపోయే స్పందన లభించింది. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రీమియర్ షోల నుంచే సినిమాపై డివైడ్ టాక్ మొదలైంది.అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా తొలి రోజు భారీ ఓపెనింగ్స్ నమోదైనప్పటికీ, దీర్ఘకాలంలో సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు నిలబడుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ‘టాక్సిక్’ తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్...