ఆయ‌న బ‌తికే ఉన్నా తీవ్ర గాయాల‌తో ఉన్నారు

ఇరాన్ తో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగియనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడినప్పటికీ, ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని పేర్కొన్నారు. ఒక కన్జర్వేటివ్ బ్రాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాలను వెల్లడించారు.“ఆయన బ‌తికే ఉన్న‌ప్ప‌టికీ చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన శరీరం ఎడమవైపు భాగం, చేయి, కాలు మొత్తం దెబ్బతిన్నాయి” అని ట్రంప్ తెలిపారు. అయితే తన వ్యాఖ్యలకు ఆయన ఎలాంటి ఆధారాలు చూపలేదు. ఇరాన్ అధికారులు ఇప్పటికీ నిర్ణయాల కోసం ఖమేనీని సంప్రదిస్తున్నారని, ఇది ఆయన బతికే ఉన్నారనడానికి నిదర్శనమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా సైనిక చర్యల్లో భాగంగా రాత్రికి రాత్రే ఇరాన్‌కు...