లాంగ్‌టాంగ్ పర్వతంపై మంచు సరస్సు..
కాట్మాండు: లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వతం(Mount Langtang Lirung) నేపాల్‌లోనే ఉన్నది. దీని ఎత్తు 7245 మీటర్లు. కాట్మాండుకు ఉత్తరాన 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ పర్వతానికి విషాద చరిత్ర ఉన్నది. 2015, ఏప్రిల్‌లో నేపాల్‌ను 7.8 తీవ్రతతో భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే ఆ భూకంపం వేళ లాంగ్‌టాంగ్ పర్వతంపై దక్షిణం వైపున కొండచరియలు విరిగిపడ్డాయి. గ్లేసియర్‌పై మట్టిచరియలు విరిగిపడడంతో లాంగ్‌టాంగ్ గ్రామం పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఆ ఘటనలో 300 మంది మృతిచెందారు. ఇక ఈ బుధవారం రోజున చైనా బోర్డర్ వద్ద సుమారు 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాలీ సమయం ప్రకారం ఉదయం 8.37 నిమిషాలకు భూమి కంపించింది....