బ‌రువు త‌గ్గేందుకు ఎలాంటి ఆహారాల‌ను తినాలి..

బరువు తగ్గేందుకు చాలామంది కేలరీలను లెక్కించడం, ఆహారం పరిమాణాన్ని తగ్గించడం, ఆకలిని నియంత్రించడం వంటి పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే వీటికి భిన్నంగా ఆహారంలో ఎలాంటి పదార్థాలను ఎంచుకుంటున్నామన్నదే కీలకమని తాజా అధ్యయనం సూచిస్తోంది. తక్కువ కొవ్వు, పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం ద్వారా కేలరీలను ప్రత్యేకంగా లెక్కించాల్సిన అవసరం లేకుండానే వాటి వినియోగాన్ని తగ్గించుకోవడంతో పాటు బరువును నియంత్రించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 16 వారాల పాటు సాగిన క్లినికల్ ట్రయల్‌లో అధిక బరువు ఉన్న పెద్దలను పరిశీలించారు. ఇందులో ఒక వర్గానికి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పుధాన్యాలపై ఆధారపడిన తక్కువ కొవ్వు శాకాహార ఆహారాన్ని అందించారు. మరో వర్గం తమ సాధారణ ఆహారపు అలవాట్లను...